ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగువారి కోసం హెల్ప్ లైన్
ఛార్ ధామ్ యాత్ర సందర్భంగా ఉత్తరకాశీ వద్ద వరదల్లో చిక్కుకుపోయిన తెలుగువారి సమాచారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం 011-2338 4188, 011-2378 2644 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.